POLITICS

కొవిడ్ టీకాపై మూఢ నమ్మకం.. ఆ దిగ్గజ ఆటగాడికి చేటే

కొవిడ్ టీకాపై మూఢ నమ్మకం.. ఆ దిగ్గజ ఆటగాడికి చేటే

Mon Aug 29 2022 23:00:01 GMT+0530 (IST)

covid Vaccine Tennis player Novak Djokovic

ప్రపంచాన్ని మూడేళ్లగా గడగడలాడిస్తున్న కొవిడ్ పేరు చెబితే.. ఇప్పటికీ అందరికీ వణుకే. ఎప్పుడెప్పుడు టీకా వేయించుకుందామా..? అని ఎదురుచూసేవారు ఇంకా ఉన్నారు. కొందరైతే
నాలుగో డోసు కూడా వేసుకున్నారు. ఇజ్రాయిల్ వంటి దేశాల్లో అయితే ఐదో డోసుకూ సిద్ధమే అంటున్నారు. అయితే టీకాతో కొవిడ్ రాదని కాదు. కొవిడ్ వచ్చినా టీకా ఇచ్చే రక్షణ
కారణంగా ప్రాణాలు నిలుస్తాయి. ఇది తెలిసే మాకు వ్యాక్సిన్ కావలంటూ అందరూ పరుగులు పెడుతున్నారు.

మరోవైపు టీకాల విషయంలో అంతరాలను ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పేద దేశాలకు తమవంతుగా ధనిక దేశాలు సరఫరా చేయాలని కోరుతున్నాయి. కాగా ఇలాంటి పరిస్థితుల్లోనూ కొవిడ్ టీకా తీసుకోని వ్యక్తి ఒకడున్నాడు. అతడు అలాంటి ఇలాంటి వ్యక్తి కూడా కాదు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్నవాడు. దిగ్గజ ఆటగాడు కూడా. టీకా వేసుకుంటే వచ్చే అనారోగ్య కారణాలను చూపుతూ జకో వ్యాక్సిన్ కు ససేమిరా అంటున్నాడు.

వెయ్యికోట్ల మంది ఒకవైపు.. అతడు ఒకవైపు ప్రపంచ వ్యాప్తం గా ఇప్పటికి కొవిడ్ టీకా డోసులు వెయ్యి కోట్లపైనే పంపిణీ జరిగాయి. కనీసం 500 కోట్ల మంది టీకా పొంది ఉంటారని చెప్పొచ్చు. కానీ ఆ దిగ్గజ ఆటగాడు మాత్రం వ్యాక్సిన్ వేసుకోను అంటున్నాడు. అతడే టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్. దీని మూల్యం.. కొన్ని గ్రాండ్ స్లామ్ టైటిళ్లు.

జకో టీకా తీసుకోకపోవడంతో సోమవారం నుంచి జరిగే యుఎస్ ఓపెన్ కు దూరమయ్యాడు. ఈ ఏడాదే జకో ఆస్ట్రేలియన్ ఓపెన్ కూ ఇలాగే అనర్హుడయ్యాడు. ఇప్పడు మరో గ్రాండ్ స్లామ్ లో ఆడే అవకాశం కోల్పోయాడు. టెన్నిస్ లో 21 గ్రాండ్ స్లామ్ లు గెలిచిన జకో.. ఈ రెండు ఆడి ఉంటే ఒక్కటైనా గెలిచేవాడు. అప్పుడు ఆ సంఖ్య 22కు చేరేది. దీంతో నాదల్ (22 టైటిళ్లు)ను సమం చేసేవాడు.

నాదల్ కే మంచి చాన్స్ జకో యూఎస్ ఓపెన్ కు దూరం కావడంతో ఈ ఏడాది మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ గెలిచేందుకు నాదల్కు మంచి ఛాన్స్. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ సొంతం చేసుకున్న అతను ఫేవరేట్‌గా అడుగుపెడుతున్నాడు.

అయితే డిఫెండింగ్ ఛాంపియన్ మెద్వెదెవ్‌తో అతనికి పోటీ తప్పదు. వివిధ కారణాలతో గత రెండు సీజన్లలో యుఎస్ ఓపెన్‌లో ఆడని నాదల్.. ఈ సారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. పొత్తి కడుపు కండరాల నొప్పితో వింబుల్డన్‌లో సెమీస్‌కు ముందే తప్పుకున్న 36 ఏళ్ల అతను ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడు. ఇప్పటికే గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో 22 విజయాలతో అతను అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో విజయం దిశగా అతనికి మెద్వెదెవ్‌తో పాటు స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్ సిట్సిపాస్ కిర్గియోస్ నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock